: బీజేపీపై తమదే పైచేయి అంటోన్న యడ్యూరప్ప
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎన్నికల్లో తమ పార్టీకి మంచి ఫలితాలే వస్తాయంటున్నారు. బీజేపీపై తమ పార్టీ కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) పైచేయి సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. బీజేపీ కన్నా కేజేపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కేజేపీ హవా సాగుతుందని యడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చే అంశంపై ఫలితాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.