: హైద‌రాబాద్‌ శిల్ప‌కళా వేదిక‌లో మహేశ్ బాబు అభిమానుల సంద‌డి చూడండి!


హైద‌రాబాద్‌లోని శిల్ప‌కళా వేదిక‌లో మహేశ్ బాబు అభిమానుల సంద‌డి మొద‌లైంది. ‘స్పైడ‌ర్’ ప్రీ రిలీజ్ వేడుక సంద‌ర్భంగా ఆ ప‌రిస‌రాల్లో ఎక్క‌డ చూసినా మ‌హేశ్ బాబు క‌టౌట్లు, పోస్ట‌ర్లు క‌న‌ప‌డుతున్నాయి. ఈ వేడుక‌కు యాంక‌ర్‌గా సుమ వ్యవహరిస్తోంది. ఈ ఈవెంట్‌కు సినీ ప్ర‌ముఖులు, స్పైడ‌ర్ న‌టులు ఒక్కొక్క‌రుగా చేరుకుంటున్నారు. యువన‌టుడు సుధీర్ బాబు ఇప్పటికే వ‌చ్చి మ‌హేశ్ అభిమానుల‌ను ప‌ల‌క‌రించాడు.

టీవీ ఛాన‌ళ్ల‌లోనే కాక స్పైడ‌ర్ ట్విట్ట‌ర్‌లోనూ ఈ వేడుక‌ను లైవ్‌లో చూడొచ్చు. మ‌రికాసేప‌ట్లో మహేశ్ బాబు ఈ వేడుక‌కు హాజ‌రుకానున్నాడు.  ‘స్పైడర్‌’ సినిమాని ఏ.ఆర్‌ మురుగదాస్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ నటించింది.

  • Loading...

More Telugu News