: అమెరికాలో తెలుగు వైద్యుడిని పొడిచి చంపేసిన దుండ‌గుడు!


అమెరికాలో మ‌రో తెలుగు వ్య‌క్తి దారుణహ‌త్య‌కు గుర‌య్యాడు. కాన్సాస్ లోని ఎడ్జ్‌మూర్‌లో క్లినిక్‌ దగ్గర డాక్టర్ అచ్యుతారెడ్డిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయ‌న‌ మృతదేహాన్ని పార్కింగ్‌ వెనక భాగంలో పోలీసులు గుర్తించి, ఉమర్‌ రషీద్‌ దత్ అనే అనుమానితుడిని విచితలోని కంట్రీక్లబ్‌ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆ దుండ‌గుడు అచ్యుతా రెడ్డితో కాసేపు మాట్లాడి ఒక్క‌సారిగా కత్తితో దాడి చేశాడని పోలీసులు గుర్తించారు.

మృతుడి స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ‌. ఆయ‌న‌ ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి 1986లో వైద్య విద్యను పూర్తి చేసి, 1989 నుంచి అమెరికాలో వైద్యుడిగా ప‌నిచేస్తున్నారు. అచ్యుత రెడ్డి మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ పరిస్థితుల్లో న‌ల్ల‌గొండ‌లోని ఆయ‌న కుటుంబానికి ఏదైనా సాయం కావాలంటే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని ట్వీట్ చేశారు. అచ్యుత్ రెడ్డిని చంపింది ఓ రోగి అని తెలుస్తోంది.   

  • Loading...

More Telugu News