: భారీ తగ్గింపు ధరలకి ఎల‌క్ట్రానిక్స్‌, స్మార్ట్‌ఫోన్స్.. ఇంకా ఎన్నో.. అమెజాన్‌లో నాలుగు రోజుల పాటు బంపర్ ఆఫర్లు!


ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్‌ అమెజాన్ నాలుగు రోజుల పాటు గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్‌ సేల్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. ఈ ఆఫ‌ర్ ప్ర‌కారం ఈ నెల‌ 21 నుంచి 24 వ‌ర‌కు మొత్తం 40 వేల‌కుపైగా ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్లు తెలిపింది. అందులో ఎల‌క్ట్రానిక్స్‌పై 2500కు పైగా ఆఫ‌ర్లు, స్మార్ట్‌ఫోన్‌ల‌పై 500కుపైగా ఆఫ‌ర్లు ఉన్నాయి. హోమ్ అప్ల‌యెన్సెస్‌, ఫ్యాష‌న్ ఐట‌మ్స్‌ల‌ను కూడా డిస్కౌంట్ ధ‌ర‌ల‌కే కొను‌గోలు చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఆపిల్‌, సామ్‌సంగ్‌, వ‌న్‌ప్ల‌స్‌, లెనోవో వంటి మొబైల్ ఉత్ప‌త్తుల కంపెనీల నుంచి 40 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు పొందవ‌చ్చ‌ని పేర్కొంది. అంతేగాక, అమెజాన్ పే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్ కార్డ్స్‌తో కొనుగోలు చేసేవారికి ప‌ది శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్న‌ట్లు చెప్పింది.  

  • Loading...

More Telugu News