: ఏపీలో గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు భారీగా పెంపు.. ఎవరెవరికి ఎంతెంతో చూడండి
ఆంధ్రప్రదేశ్ సాంఘిక గురుకుల పాఠశాలల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మీడియాతో మంత్రి నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో పనిచేసే పీజీ ఉపాధ్యాయుడి వేతనాన్ని రూ. 16,150 నుంచి రూ. 24,225కు పెంచినట్టు తెలిపారు. నాన్ పీజీ ఉపాధ్యాయుల వేతనాన్ని రూ. 14,860 నుంచి రూ. 22,290కి పెంచామని... పీఈటీల జీతాన్ని రూ. 10,900 నుంచి రూ. 16,350కి పెంచినట్టు వెల్లడించారు. అలాగే లైబ్రేరియన్ల జీతాన్ని రూ. 13,660 నుంచి రూ. 20,490కి పెంచినట్టు తెలిపారు. స్టాఫ్ నర్స్ జీతాన్ని రూ. 17,295కు, క్వాలిఫై కాని స్టాఫ్ నర్స్ కు రూ. 13,800కు పెంచినట్టు చెప్పారు.