: హిట్ ఇచ్చిన దర్శకుడి కోసం గెస్టు రోల్ చేసిన రాశి ఖన్నా!


బొద్దుగా కనిపించే రాశి ఖన్నా .. ఆ తరువాత స్లిమ్ గా మారిపోయి, వరుస ఛాన్సులు కొట్టేస్తోంది. ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' .. రవితేజతో 'టచ్ చేసి చూడు' .. వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' సినిమాల్లో ఆమె అవకాశాలను అందుకోగలిగింది. ఇంత బిజీలోనూ ఆమె తమిళ .. మలయాళ సినిమాలను అంగీకరించడం విశేషం.

 ఈ నేపథ్యంలోనే ఆమె 'రాజా ది గ్రేట్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఆమెనే ఫేస్ బుక్ ద్వారా స్వయంగా తెలియజేసింది. ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన అనిల్ రావిపూడి, 'సుప్రీమ్' సినిమాతో రాశి ఖన్నాకి హిట్ ఇచ్చాడు. అందువలన ఆయన గెస్టు రోల్ కోసం అడిగితే రాశి ఖన్నా కాదనలేకపోయిందట. తాను తెరపై కనిపించేది కాసేపే అయినా, ఆ ప్రభావం ఆడియన్స్ పై బాగానే ఉంటుందని చెబుతోంది. అక్టోబర్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.        

  • Loading...

More Telugu News