: అందమైన మా అమ్మ.. ఆమె పక్కన ఓ జోకర్లా నేను!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్ ల ద్వారా ఎంతటి సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా, ఓ ఆసక్తికర ఫొటోతో పాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వర్మ చిన్న వయసులో ఉన్నప్పుడు తన తల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. ‘అందమైన ఆ మహిళ మా అమ్మ. ఆమె పక్కన ఓ జోకర్ లా, సాధారణంగా కనపడుతూ నిలబడి ఉన్న ఆ కుర్రాడిని నేనే’ అని తన పోస్ట్ లో వర్మ పేర్కొన్నారు. కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు బాగానే స్పందించారు. ‘ఈ ప్రపంచానికి అద్భుతమైన కానుకను ఇచ్చిన అమ్మకు థ్యాంక్స్’, ‘తెలివి, ధైర్యం.. షార్ట్ టెంపర్.. విమర్శకుడు’, ‘హలో సార్, లుకింగ్ గుడ్’ అని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా వర్మపై విమర్శలు గుప్పించిన నెటిజన్లూ ఉన్నారు.