: ఈ హీరోలతో నటించాలని హనీ ప్రీత్ కలలు కనేదట!


అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడ్డ డేరా బాబా దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ కు బాలీవుడ్ లో చెలరేగిపోవాలనే కోరిక ఉండేదట. అగ్రనటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ ల సరసన నటించాలని కలలు కనేదట. గుర్మీత్ సింగ్ కూడా హనీ ప్రీత్ ను టాప్ హీరోయిన్ ను చేయాలని భావించాడట. హనీప్రీత్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడని డేరాబాబా... బాలీవుడ్ సినీ ప్రయత్నాల కోసం ముంబైలో ఏకంగా నాలుగు అంతస్తుల ఖరీదైన భవనాన్ని కూడా కొనుగోలు చేశాడట. ఇందులో ఓ స్టూడియోను కూడా ఏర్పాటు చేశాడట. మరోవైపు హాలీవుడ్ లో సినిమాలు నిర్మించే దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టాడట. ఈ విషయాలను గతంలో డేరా ఆశ్రమంలో ఉన్న భూపేంద్ర గోర్ వెల్లడించాడు. అయితే, డేరా బాబా జైలుకు వెళ్లడంతో, ప్లాన్ మొత్తం తలకిందులైంది. 

  • Loading...

More Telugu News