: నాకు ఇష్టమైన నటుడు విజయ్ దేవరకొండ : హీరోయిన్ షాలిని పాండే
విజయ్ దేవరకొండ తనకు ఇష్టమైన నటుడని ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలిని పాండే చెప్పింది. నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన షాలిని అస్వస్థతకు గురవడంతో, ఓ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, ఆమె ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో మాట్లాడింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ, తనకు ఇష్టమైన హీరో విజయ్ దేవరకొండ అని చెప్పింది. ‘మహానటి’ చిత్రంలో తాను నటిస్తున్నానని, అయితే, అందులో తాను నటించబోయే పాత్ర గురించి ఇప్పుడే చెప్పనని మరో అభిమాని ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ‘100% లవ్’ తమిళ రీమేక్ లో నటిస్తున్నానని ఇంకో ప్రశ్నకు సమాధానంగా షాలిని పాండే చెప్పింది.