: ఫోర్బ్స్ పత్రికకు ఎక్కిన దావూద్.. ధనిక నేరస్తులలో రెండో స్థానం!
భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, 1993 ముంబయి వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం ప్రపంచంలోనే రెండో సంపన్న నేరగాడని ప్రముఖ అమెరికన్ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ తెలిపింది. ఇక మొదటి స్థానంలో కొలంబియా డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ ఉన్నాడని తెలిపింది. కేవలం బ్రిటన్‌లోనే దావూద్‌కు 6.7 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయని, అతడి ఆచూకీ చెప్పినవారికి ప్రకటించిన రివార్డుల మొత్తం 25 మిలియన్ డాలర్లని చెప్పింది. దావూద్ సుమారు 16 దేశాల్లో దందాలు నడుపుతున్నట్లు తెలిసింది.