: వేలంలో పాల్గొనకపోతే 15 కోట్లు జప్తు చేస్తామని ఆళ్లకు సుప్రీం తెలిపింది: మంత్రి మాణిక్యాలరావు


సదావర్తి భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. మరోసారి వేసే వేలంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఆదాయం రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు చెప్పినట్టుగానే రూ. 1300 కోట్లు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అయితే, వేలంపాటలో పాల్గొనకపోతే రూ. 15 కోట్లను జప్తు చేస్తామంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తు చేశారు. వైశ్యులను ఉద్దేశిస్తూ ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై స్పందిస్తూ... ఆర్యవైశ్యులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. ఒక కులాన్ని కించపరచడం చాలా తప్పని చెప్పారు. ఆ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని కోరారు.

  • Loading...

More Telugu News