: చాందినిపై అత్యాచారం జ‌ర‌గ‌లేదు: నిందితుడిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టిన పోలీసులు


హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన చాందిని హ‌త్య కేసును పోలీసులు ఛేదించిన విష‌యం తెలిసిందే. ఈ రోజు నిందితుడు సాయికిర‌ణ్‌ను పోలీసులు మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా సైబ‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్‌ సందీప్ శాండిల్యా మాట్లాడుతూ... సీసీ కెమెరాలో కీలక ఆధారాలు ల‌భించాయని అన్నారు. చాందినిని నిందితుడు తీసుకుని వెళ్లేట‌ప్పుడు అత‌డి వెన‌క భాగం మాత్ర‌మే క‌నిపించిందని చెప్పారు.

ఈ కేసులో చాందిని స్నేహితులంద‌రినీ విడివిడిగా ప్ర‌శ్నించామ‌ని చెప్పారు. స్నేహితులు ఇచ్చిన వివ‌రాల ఆధారంగా ద‌ర్యాప్తు చేశామ‌ని అన్నారు. నిందితుడు మొద‌ట త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడని చెప్పారు. చాందినిపై అత్యాచారం జ‌ర‌గ‌లేదని స్ప‌ష్టం చేశారు. అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు జ‌రిపామ‌ని వివ‌రించారు. నిందితుడిని ఘ‌ట‌నాస్థ‌లికి తీసుకెళ్లి కూడా ప్ర‌శ్నించామ‌ని చెప్పారు. 

  • Loading...

More Telugu News