: అంత గొప్ప మ్యూజిక్ అందించాలనేది రెహ్మాన్ కోరికట!


ప్రేక్షకులను బాత్రూమ్ కి కూడా వెళ్లనివ్వకుండా, కుర్చీలో నుంచి కదలనివ్వకుండా ఉంచేంత గొప్ప మ్యూజిక్ అందించాలనేది తన చిరకాల కోరిక అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, బాత్రూమ్ కో, పాప్ కార్న్ కోసమో బయటకు వెళ్తే.. ‘సంగీతం ఎక్కడ మిస్ అవుతామో’ అనే భావన ప్రేక్షకులకు కలిగించే అద్భుత సంగీతాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నట్టు రెహ్మాన్ తెలిపారు. కాగా, రెహ్మాన్ తన కాన్సర్ట్ టూర్లతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ నేపథ్యంలోనే తన తాజా ఇంటర్వ్యూలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News