: ఆ విషయం తెలిసుంటే 'అర్జున్ రెడ్డి' సినిమా చేసుండేదాన్ని కాదు: హీరోయిన్ శాలిని పాండే
తాను నటించిన తొలిచిత్రం 'అర్జున్ రెడ్డి'తోనే పాప్యులర్ అయింది హీరోయిన్ శాలిని పాండే. ముఖ్యంగా సినిమాలో హీరో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ దృశ్యాలు వివాదాస్పదమైనప్పటికీ, ఆమెకు ఘన విజయాన్ని అందించింది. అయితే, శాలిని ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే విషయాన్ని తనకు ముందే చెప్పలేదని... చెప్పి ఉంటే సినిమాను తిరస్కరించేదాన్నని తెలిపింది.
సినిమాలో చుంబనాలు, అభ్యంతరకర సన్నివేశాల్లో నటించనని చెప్పిన తర్వాతే తన తండ్రి 'అర్జున్ రెడ్డి'లో నటించేందుకు ఒప్పుకున్నారని చెప్పింది. అయితే, సినిమాను చూసిన వారు మాత్రం ఎమోషన్స్ లో భాగంగానే ముద్దు సన్నివేశాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహిస్తారని తెలిపింది. తన తండ్రి కూడా ఈ సినిమాను చూశారని... ఆ తర్వాత సినిమా చాలా బాగుందంటూ అతని స్నేహితులతో చెప్పారని పేర్కొంది.