: ఇక ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వేణుమాధవ్... నేడు చంద్రబాబుతో భేటీ!
ఇప్పటివరకూ అడపాదడపా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చిన నటుడు, కమెడియన్ వేణుమాధవ్, ఇకపై టీడీపీలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కొనసాగనున్నారు. నేడు మరోసారి చంద్రబాబుతో భేటీ కానున్న వేణు మాధవ్, తాను చేయాల్సిన పనులు, తనపై పెట్టే బాధ్యతల గురించి మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో సినీ ప్రముఖులను కూడా భాగం చేయాలని చంద్రబాబు భావిస్తుండగా, అందుకు తొలి అడుగుగా, వేణుమాధవ్ పలు పట్టణాలు, మండల కేంద్రాల్లో పర్యటిస్తారని సమాచారం. సినీ నటులను ఇళ్లకు పంపించి, సంక్షేమ పథకాలను గురించి వారికి చెప్పిస్తే బాగుంటుందని వేణు మాధవ్ చేసిన సూచన చంద్రబాబుకు నచ్చిందని పార్టీ వర్గాలు తెలిపాయి.