: అవిశ్వాస తీర్మానం పెడతాం.. గవర్నర్ వారం రోజుల్లోగా స్పందించాలి: స్టాలిన్
రాష్ట్ర ప్రభుత్వంపై తాము విశ్వాసం కోల్పోయామని తమిళనాడు ప్రతిపక్ష డీఎంకే పార్టీ నేత స్టాలిన్ అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా తాము అవిశ్వాస తీర్మానం తీసుకొస్తామని తేల్చి చెప్పారు. తాను నెగ్గగలననే ధీమా ఉంటే పళనిస్వామి వెంటనే శాసనసభను సమావేశపరచాలని గవర్నర్‌ను కోరాలని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో ఆ పార్టీ బలం తగ్గిందని స్టాలిన్ అన్నారు. ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్ రావును ఈ అంశంపై కలిశామని, ఈ అంశంపై గవర్నర్ వారం రోజులలోగా స్పందించాలని ఆయన కోరారు. లేకపోతే తాము న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.