: నాకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు: రాఘవ లారెన్స్ ప్ర‌క‌ట‌న


రాజకీయాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ సినీ న‌టుడు, ద‌ర్శ‌కుడు రాఘవ లారెన్స్  అన్నారు. ఈ రోజు ఆయ‌న ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేస్తూ... త‌న‌ను రాజకీయాల్లోకి లాగ‌కూడ‌ద‌ని కోరారు. తాను రాజకీయాల గురించి ఎన్న‌డూ మాట్లాడలేదని తెలిపారు. తాను ముని - 4 సినిమా పూజ కోసం నిన్న‌ తిరుపతికి వెళ్లొచ్చానని అన్నారు.

అనంత‌రం మీడియా వారు తన సినిమా వివరాలతో పాటు తన తల్లికి కట్టించిన గుడి వివరాలు అడిగారని తెలిపారు. త‌న‌కు సేవ చేయ‌డం, ఆధ్యాత్మికత‌ అంటేనే ఇష్టమని తెలిపారు. నీట్‌పై ఇటీవ‌ల తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను రాజకీయం చేయొద్దని కోరారు. నీట్ ద్వారా మెడికల్ కోర్సుల్లో ప్ర‌వేశాలు చేప‌డుతున్నందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్న వైద్య విద్యార్థిని అనిత కుటుంబానికి తాను సాయం చేశానా? లేదా? అన్న విషయం తనకు, ఆ భగవంతునికి, అనిత కుటుంబానికి తెలిస్తే చాలని అన్నారు.    

  • Loading...

More Telugu News