: సినిమా డిస్ట్రిబ్యూట‌ర్‌గా మార‌నున్న ఆమిర్ ఖాన్‌!


బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ ఆమిర్‌ ఖాన్ త్వ‌ర‌లో సినిమా పంపిణీ రంగంలో అడుగుపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఒక ప‌క్క న‌ట‌న‌, మ‌రో ప‌క్క ద‌ర్శ‌క‌త్వం, ఇంకో ప‌క్క సినిమాల నిర్మాణం ఇలా సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఆమిర్ త‌న ప్ర‌తిభ‌ను చూపించాడు. వీటితో త్వ‌ర‌లో సినిమా పంపిణీలోకి కూడా ఆమిర్ రానున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు... ఇందుకు సంబంధించిన నిర్ణ‌యాలు, చ‌ర్చ‌లు కూడా ఓ కొలిక్కి వ‌చ్చాయ‌ని వారు అంటున్నారు.

ఇప్ప‌టికే రెడ్‌ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పేరుతో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ పంపిణీ రంగంలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో తెర మీదే కాకుండా తెర వెనుక కూడా ఖాన్‌ల మ‌ధ్య పోటీ ఏర్ప‌డుతుంద‌ని బాలీవుడ్‌ వర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

  • Loading...

More Telugu News