: ట్విట్టర్ లో రెండు మిలియన్లకు చేరిన పవన్ కల్యాణ్ ఫాలోవర్ల సంఖ్య


జనసేన పార్టీని పెట్టిన తరువాత తన అభిప్రాయాలను పంచుకోవడానికి సినీనటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శుభాకాంక్ష‌లు తెల‌పాల‌న్నా, ఏ విషయాన్నయినా విమ‌ర్శించాల‌న్నా, ఉద్య‌మానికి పిలుపునివ్వాల‌న్నా ఆయ‌న ట్విట్ట‌ర్‌నే ఉప‌యోగించుకుంటున్నారు. కాగా, నేటికి ఆయ‌న ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ నేరుగా స్పందించ‌కుండా ట్విట్ట‌ర్ ద్వారా మాత్ర‌మే స్పందిస్తున్నారంటూ ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న వారూ లేక‌పోలేదు. ట్విట్టర్ లో స్పందించే క్రమంలో ఆయన ట్వీట్లలో ఎన్నో అక్షర దోషాలు కనిపిస్తున్నాయని కూడా విమర్శలు ఉన్నాయి.  

  • Loading...

More Telugu News