: హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్న తాప్సీ?
బాలీవుడ్‌లో తాప్సీకి చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా, అవకాశాలకు మాత్రం కొదువలేనట్లుగా కనిపిస్తోంది. వరుస అవకాశాలతో తాప్సీ బాలీవుడ్‌లో పాగా వేసింది. ఇప్పటికే ఆమె నటించిన `జుద్వా2` సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోగా ఆమె మరో ఛాన్స్ కొట్టేసింది. హాకీ ఆటగాడు సందీప్ సింగ్ జీవితంలో జరిగిన ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో తాప్సీ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇందులో హీరో ప్రియురాలిగా తాప్సీ నటించనుంది. సందీప్ సింగ్ పాత్రలో `ఉడ్తా పంజాబ్` ఫేం దిల్జీత్ దోసాంజ్ నటించనున్నాడు. ఈ చిత్రానికి షాద్ అలీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా కోసం నటీనటులిద్దరూ హాకీ ఆటగాళ్ల దగ్గర శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పంజాబ్‌లో ప్రారంభం కానుంది.