: ఢిల్లీ డ్రైవర్లలో 30 శాతం మందికి దృష్టి దోషాలు: సంచలన వాస్తవాల వెల్లడి


దేశ రాజధానిలో వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లు తీవ్రమైన దృష్టి దోషంతో బాధపడుతున్నారని కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో కేంద్ర రోడ్డు పరిశోధనాసంస్థ తాజాగా ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో ప్రతి పది మంది డ్రైవర్లలో ముగ్గురు అంటే ఢిల్లీలో వాహనాలు నడిపై డ్రైవర్లలో ముప్పైశాతం మంది దృష్టి దోషాలతో బాధపడుతున్నారని తేలింది.

627 ప్రైవేటు కార్లు, టాక్సీలు, ట్రక్కులు, బస్సులు నడిపే డ్రైవర్లలో 19 శాతం మందికి తీవ్ర వర్ణ అంధత్వం (కలర్ బ్రైండ్‌ నెస్) ఉందని తేలింది. ఇంకో 23 శాతం మంది డ్రైవర్లు స్వల్ప వర్ణ అంధత్వ సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. అంతే కాకుండా ఈ దృష్టి దోషంతోనే ఢిల్లీలోని వాహనాల్లో 29 శాతం వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రోజుకు పదిగంటల పాటు నడుపుతున్నారని వారు తెలిపారు. ఈ సమస్య కారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని పరిశోధనా సంస్థ తెలిపింది. 15 శాతం మంది ఇలాగే చేస్తున్నారని వారు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News