: 'ఆంధ్రప్రదేశ్ ఓ దేశం'... మరోసారి తడబడిన నారా లోకేశ్!
తన ప్రసంగాల్లో అప్పుడప్పుడూ తడబడి, విపక్షాల విమర్శలకు అవకాశమిచ్చే ఏపీ మంత్రి నారా లోకేశ్, మరోసారి అదే పని చేశారు. విశాఖలో జరుగుతున్న 'అంతర్జాతీయ ఆవిష్కరణల ప్రదర్శన - 2017'లో పాల్గొన్న ఆయన, ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ ను ఓ దేశంగా పేర్కొన్నారు. ప్రసంగం మధ్యలో ఏపీని ఓ కంపెనీగా, కంట్రీగా అభివర్ణిస్తూ మాట్లాడిన ఆయన, ఆపై తప్పును గుర్తించి కరెక్ట్ చేసుకోకుండానే మాట్లాడుతూ వెళ్లిపోయారు.
గతంలోనూ బహిరంగ వేదికలపై లోకేష్ కొన్నిసార్లు తడబడిన సంగతి తెలిసిందే. అంబేద్కర్ వర్థంతి నాడు శుభాకాంక్షలు చెప్పి ఓసారి, మంచినీటి సమస్య కల్పనకు కృషి చేస్తానని మరోసారి, 200 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని ఇంకోసారి ఆయన పొరపాటు వ్యాఖ్యలు చేయగా, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఆయనపై జోకులు వేసుకున్న సంగతి తెలిసిందే.