: క్రికెట్ బెట్టింగ్ కేసులో ఉన్న టీడీపీ నేత కోసం పోలీసు గాలింపు ముమ్మరం!


క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం ఏపీని కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఈ వ్యవహారంలో ఉండటంతో, సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పోలీసు విచారణకు వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులైన తొమ్మిది మందికి సంబంధించిన అక్రమ ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధమైంది. మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నేత శరత్ చంద్ర అలియాస్ చర, ఆయన కుమారుడు సుభాష్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. వీరిద్దరూ పట్టుబడితే, బెట్టింగ్ లో మరికొందరి పేర్లు బయటకు వస్తాయని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News