: చివరి కోరికగా భార్యకు లేఖ రాసిన అఫ్జల్ గురు
పార్లమెంటుపై దాడి కేసులో నేరస్థుడు, ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేయడానికి కొన్ని గంటల ముందు భార్యకు లేఖ రాసినట్లు జైలు అధికారులు తెలిపారు. ఉరి తీయబోతున్నట్లు తీహర్ జైలు అధికారులు అఫ్జల్ కు చెప్పినపుడు అతడు కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత తన భార్యకు లేఖ రాయాలనుకుంటున్నానని అఫ్జల్ చివరి కోరిక వెలిబుచ్చాడని అధికారులు తెలిపారు. జైలు సూపరింటెండెంట్ కాగితం, కలం ఇవ్వడంతో, అఫ్జల్ భార్యకు ఉర్దూలో లేఖ రాశాడు. అయితే ఉరితీసిన రోజే ఈ ఉత్తరాన్ని పోస్టు చేసినా ఇంత వరకు అఫ్జల్ కుటుంబానికి ఈ లేఖ అందలేదని తెలుస్తోంది.