: వాట్స్ యాప్ లో హనీ ప్రీత్ మొబైల్ నెంబర్ వైరల్!


డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ జైలు శిక్ష అనంతరం పరారైన హనీప్రీత్ ఇన్సాన్ ఫోన్ నెంబర్ సామాజిక మాధ్యమం వాట్స్ యాప్ లో వైరల్ గా మారింది. గుర్మీత్ తో పాటు హనీ ప్రీత్ కు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అసోసియేషన్ సభ్యత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభ్యత్వం సర్టిఫికేట్ ను మీడియా సంపాదించి, విడుదల చేసింది. దీంతో అందులోని హనీ ప్రీత్ నెంబర్ వాట్స్ యాప్ లోకి చేరింది.

పర్యవసానంగా ఆ నెంబర్ కి చాలా మంది ఫోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది స్విచ్ ఆఫ్ లో ఉండడం విశేషం. ఈ వాట్స్ యాప్ నెంబర్ ప్రొఫైల్ పై గుర్మీత్, హనీ ప్రీత్ పిక్ ఉంది.ఈ నెంబర్ పై గత ఆగస్టులో గుర్మీత్ కు జన్మదిన శుభాకాంక్షల వీడియోతో పాటు, ఆగస్టు 20న ఖతౌలీ రైలు ప్రమాదంపై సంతాప సందేశం ఉంది. హనీ ప్రీత్ ఇంటర్మీడియెట్ చదువుకున్నట్టు సభ్యత్వ సర్టిఫికేట్ లో ఉంది. కాగా, నేపాల్ పారిపోయే అవకాశముందని ఆమె ఫోటోలను దేశ సరిహద్దుల్లో అతికించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News