: హైదరాబాదులోని పీవీ ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్ పై కారు దగ్ధం


హైదరాబాదులోని పొడవైన పీవీ ఎక్స్‌ ప్రెస్‌ ఫ్లై ఓవర్ పై కారు దగ్థం కావడం కలకలం రేపింది. శంషాబాద్ నుంచి మాసబ్ ట్యంక్ దిశగా వస్తున్న కారు ఫ్లైఓవర్ దాటే క్రమంలో అందులో మంటలు చెలరేగాయి. పొగలు రావడం గుర్తించిన కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు వేగంగా స్పందించి, కిందికి దూకేశారు. వారిలా కారు నుంచి బయటపడగానే కారుకు మంటలంటుకోవడం, కారు పూర్తిగా దగ్ధం కావడం జరిగిపోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలికి చేరుకున్నారు. కాగా, సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగి ఉంటాయని వారు భావిస్తున్నారు. 

  • Loading...

More Telugu News