: ట్రంప్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే..!: వైట్ హౌస్ మాజీ చీఫ్ స్టీవ్ బన్నన్
ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి జేమ్స్ కొమేని తొలగించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధునిక రాజకీయ చరిత్రలో అతిపెద్ద తప్పిదం చేశారని వైట్ హౌస్ మాజీ చీఫ్ స్టీవ్ బన్నన్ పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రస్తుత, పూర్వ రిపబ్లికన్ నేతలపై విరుచుకుపడ్డారు. జార్జ్ డబ్ల్యూ. బుష్ పరిపాలన కాలంలో పని చేసిన రిపబ్లికన్ నేషనల్ సెక్యూరిటీ అధికారులను ఆయన ఇడియట్స్ గా అభివర్ణించారు. జేమ్స్ కోమేని తొలగించాలనే ట్రంప్ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని ఆయన తెలిపారు. ఎఫ్బీఐ ఒక స్వతంత్ర సంస్థ అని, దాని పనితీరులో వేలు పెట్టవద్దని సూచించానని ఆయన తెలిపారు. ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పిదం జేమ్స్ కోమేని పదవి నుంచి తప్పించడమేనని ఆయన స్పష్టం చేశారు.