: హీరో అజిత్ భుజానికి శస్త్ర చికిత్స.. నెల రోజుల విశ్రాంతి!
ప్రముఖ దక్షిణాది హీరో అజిత్ భుజానికి శస్త్ర చికిత్స జరిగినట్టు తెలుస్తోంది. ఆమధ్య బల్గేరియాలో ‘వివేకం’ సినిమా షూటింగ్ జరిగిన సమయంలో గాయపడ్డ అజిత్ కు, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. నెలరోజులకు పైబడి విశ్రాంతి తీసుకోవాలని అజిత్ కు వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది.
కాగా, షూటింగుల్లో గాయపడటం అజిత్ కు కొత్తేమీ కాదు, గతంలో పలుసార్లు గాయపడ్డాడు. మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ‘వివేకం’ కథ చెప్పడానికి అజిత్ వద్దకు ఆ చిత్ర దర్శకుడు శివ వెళ్లినప్పుడు..అజిత్ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకుని ఉన్నాడట. దీంతో, ‘వివేకం’ చిత్రంలో అజిత్ ఎలా నటిస్తారనే ఆలోచనలో శివ పడ్డాడు. అయితే, పూర్తిగా కోలుకుని మరింత ఫిట్ గా అజిత్ తయారై ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.