: హమ్మయ్య మేము లక్కీ: డొనాల్డ్ ట్రంప్


కరేబియన్ దీవులను అతలాకుతలం చేసి ఫ్లోరిడాపై విరుచుపడిన ఇర్మా తుపాను ఉద్ధృతి కాస్తంత తగ్గిన వేళ, హరికేన్ పై అధికారులతో సమీక్షించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'మేము లక్కీ' అన్నారు. ఫ్లోరిడా పశ్చిమ తీరంపై ఎక్కువ ప్రభావాన్ని ఇర్మా చూపిందని గుర్తు చేసిన ఆయన, తూర్పు తీరంపై అంత ప్రభావం లేదని, అందువల్ల తాము నిజంగానే అదృష్టవంతులమని తెలిపారు.

మరో నాలుగైదు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించారు. ఇర్మా నష్టం నుంచి అమెరికా బయటపడాలంటే చాలా డబ్బులను ఖర్చు పెట్టాల్సి వుంటుందని, అయితే, డబ్బు కన్నా తనకు ప్రజల ప్రాణాలను కాపాడటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు. ఇర్మా ప్రయాణించే మార్గంలోని ఇతర రాష్ట్రాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. జార్జియా, అలబామా, దక్షిణ కరోలినా టెన్నెస్సే గవర్నర్లతో తాను మాట్లాడానని, వారంతా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు.

  • Loading...

More Telugu News