: 'బిగ్ బాస్'లో అడుగుపెట్టని కారణమిదే: యాంకర్ శ్రీముఖి


అర్ధ శతదినోత్సవం జరుపుకుని విజయవంతంగా నడుస్తున్న తెలుగు రియాలిటీ షో 'బిగ్ బాస్'లో తనకు అవకాశం లభించినా, పాల్గొనకపోవడానికి కారణాన్ని టాప్ యాంకర్ శ్రీముఖి వెల్లడించింది. తనకు బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టమని, తాను సరిగ్గా ఓ షోకు ఒప్పుకున్న మరుసటి రోజే 'బిగ్ బాస్'లో పాల్గొనాలన్న ఆహ్వానం వచ్చిందని, అందువల్లే హౌస్ లో కాలు పెట్టలేదని స్పష్టం చేసింది.

 ఫేస్ బుక్ లో తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న శ్రీముఖి, కామెడీ షోలతో తాను చాలా బిజీగా ఉన్నందునే ఈ కార్యక్రమంలో పాల్గొనలేక పోయానని చెప్పింది. హిందీలో ఇదే షోను తాను పదే పదే చూశానని కూడా అంది. ఇక తొలుత పెద్ద స్టార్స్ నే రంగంలోకి దింపాలని బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు భావించినా, కొందరు షూటింగ్స్ తో బిజీగా ఉండి, మరికొందరు అన్ని రోజులు ఉండటం ఇష్టంలేక 'నో' చెప్పారని సమాచారం.

  • Loading...

More Telugu News