: టీమిండియా ఆటగాళ్లను అక్కడి టీ20ల్లో ఆడించడం వల్ల ఐపీఎల్ కు నష్టం లేదు: స్టెలెన్ భాష్ జట్టు యజమాని ప్రీతి జింటా
టీమిండియా ఆటగాళ్లను ఇతర దేశాలు నిర్వహించే టీ20 లీగ్ లలో ఆడేందుకు అనుమతినివ్వడం ద్వారా ఐపీఎల్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని సౌతాఫ్రికాలో ప్రారంభం కానున్న గ్లోబల్ టీ20 లీగ్ ఫ్రాంచైజీ స్టెలెన్ బాష్ సహయజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తెలిపింది. ఐపీఎల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా దక్షిణాఫ్రికాలో ఆరంభం కాబోతున్న గ్లోబల్ టీ20 లీగ్ లో స్టెలెన్ బాష్ లో జట్టులో యాజమాన్య వాటా కొనుగోలు చేసింది.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, టీ20 ప్రపంచ వ్యాప్తంగా వేగంగా ఎదుగుతోందని అభిప్రాయపడింది. ఇతర దేశాల టీ20 లీగుల్లో వర్థమాన, సీనియర్ క్రికెటర్లు ఆడడం వల్ల భారత జట్టుకు మేలు జరుగుతుందని తెలిపింది. విదేశీ గడ్డపై పోటీ తత్వం, అనుభవం పెరుగుతాయని తెలిపింది. టీ20 లీగ్ సక్సెస్ వెనుక ఆట మూడు గంటల నిడివి కలిగి ఉండడం, ఉత్కంఠ రేకెత్తించి, వేగంగా ముగియడం కారణమని చెప్పింది.