: భువనేశ్వర్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కూలి ఒకరి మృతి!
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని బొమిఖల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ లో కొంత భాగం ఈ రోజు మధ్యాహ్నం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి భువనేశ్వర్‌కు చెందిన వ్యాపారి సత్య పట్నాయక్ (40)గా గుర్తించారు. పట్నాయక్ కుమార్తె షీతల్ కూడా తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో 20 మంది కార్మికులు ఫ్లై ఓవర్ పనుల్లో నిమగ్నమయ్యారు. సుమారు నలుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక శకటాలు, సహాయక బృందాలు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.