: కిమ్ జాంగ్ ఉన్ కస్టమర్లలో భారత్: సమాచారం ఉందన్న ఐరాస


ఉత్తర కొరియా నుంచి వస్తువులు దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు ఉన్నా, పలు దేశాలు అక్రమంగా వివిధ ప్రొడక్టులను ఉత్తర కొరియా నుంచి తెచ్చుకుంటున్నాయని, ఆ జాబితాలో ఇండియా కూడా ఉందని ఐక్యరాజ్యసమితి కీలక ప్రకటన చేసింది. గడచిన ఆరు నెలల్లో చైనాతో పాటు ఇండియా, శ్రీలంక, మలేషియా దేశాలకు ఉత్తర కొరియా ఇనుము, బొగ్గు తదితరాలను ఎగుమతి చేసిందని, మొత్తం 270 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తుల షిప్పింగ్ జరిగిందని ఐరాస పేర్కొంది.

ఇందుకు సంబంధించిన సమగ్రమైన సమాచారం తమవద్ద ఉందని తెలియజేసింది. అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న నార్త్ కొరియాపై ఆర్థిక, రవాణా, ఆయుధ పరమైన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సిరియాలో నిషేధిత కార్యకలాపాల్లో సైతం నార్త్ కొరియా పాల్గొంటున్నదా? అనే దిశగా విచారణ ప్రారంభించామని ఐరాస పేర్కొంది.

  • Loading...

More Telugu News