: సెహ్వాగ్ చమత్కారం: పార్థివ్ పటేల్ ను 'సీసీ' అంటూ సంబోధన!


సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా సోషల్ మీడియాలో జోకులు వేస్తూ, పంచ్ లు విసిరే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 10 వేల పరుగులు సాధించిన వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ పార్థివ్ పటేల్ కు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పాడు. '10,000 ముబారక్ పీపీ ఉరఫ్ సీసీ!' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించాడు.

తొలుత 'పీపీ', 'సీసీ' అంటే ఎవరని ఆలోచించిన వారికి 'పీపీ' అంటే పార్థివ్ పటేల్ అని అర్థమైపోయింది. ఇక 'సీసీ' అంటే ఎవరన్నది తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. 'సీసీ' అంటే చోటా చేతన్ అని, పార్థివ్ ను ఈ ముద్దు పేరుతో పిలుస్తుంటారు కాబట్టే వీరూ ఇలా సంబోధించాడని అభిమానులు కనిపెట్టారు. తన హాస్య చతురతను ప్రదర్శించే విషయంలో ముందుండే వీరూ, ఇటీవల ఇషాంత్ శర్మను అభినందిస్తూ, 'బుర్జ్ ఖలీఫా'తో పోల్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News