: బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ తనయుడు!


స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'జాతి మొత్తం మోదీ వెంటే నిలవాలి' అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి కలకలం రేపిన టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. శనివారం నాడు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్ మాధవ్, రాంలాల్ లతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరికపైనే ఆయన చర్చించినట్టు తెలుస్తోంది.

కాగా, అరవింద్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ సైతం కన్ఫర్మ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే డీఎస్ ప్రధాన అనుచరుల్లో ఒకరైన సంగారెడ్డి మాజీ డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. డీఎస్ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన వాటిని ఖండించి, తాను టీఆర్ఎస్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. తన కుమారుడి అభిప్రాయాలతో తనకు సంబంధం లేదని కూడా తేల్చి చెప్పారు. తెలంగాణలో విస్తరించాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిష్ఠానం, సాధ్యమైనంత మందిని పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది.

  • Loading...

More Telugu News