: చిరు-పవన్ మల్టీస్టారర్ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది: సుబ్బరామి రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ సినిమా నిర్మిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుబ్బరామి రెడ్డి మరోసారి అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉందని వ్యాఖ్యానించారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆ సినిమాపైనే పనిచేస్తున్నారని అన్నారు. ఆ ఇద్దరు హీరోల కాంబినేషన్‌లో త్రివిక్రమ్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కిస్తాడని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌తో ప్రస్తుతం త్రివిక్రమ్ మరో సినిమా రూపొందిస్తున్నారని తెలిపారు.