: శతఘ్ని విధ్వంసక క్షిపణి పరీక్ష నాగ్ విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన శతఘ్ని విధ్వంసక క్షిపణి నాగ్ పరీక్ష విజయవంతమైందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఈ రోజు ప్రకటన చేసింది. నిన్న రాజస్థాన్లోని పశ్చిమ భాగాన ఉన్న ఎడారి ప్రాంతంలో ఈ పరీక్షను రెండుసార్లు నిర్వహించినట్లు వివరించింది. వేర్వేరు పరిధుల్లోని రెండు లక్ష్యాలను నాగ్ ఛేదించిందని తెలిపింది. ఇది మూడో తరానికి చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి అని తెలిపింది.