: జీఎస్‌టీ కింద రూ.44,29,516 చెల్లించిన బీసీసీఐ!


కేంద్ర ప్ర‌భుత్వం జీఎస్‌టీని అమ‌లులోకి తెచ్చిన తొలి నెలలో భారీగా పన్నులు వసూలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు బీసీసీఐ జులై నెలకు గానూ రూ.44,29,516ను జీఎస్‌టీ కింద చెల్లించింది. అలాగే, టీమిండియా ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్‌కు కూడా ఐదు నెలల కాలానికి మొత్తం రూ.58, 87,139ను చెల్లించిన‌ట్లు బీసీసీఐ పేర్కొంది.

 ఇక 2015-16 సీజన్‌ల్లో అంతర్జాతీయ మ్యాచుల నుంచి ఆర్జించిన గ్రాస్‌ రెవెన్యూలను కొంతమంది ప్లేయర్లకు పంచినట్టు తెలిపింది. అత్య‌ధికంగా స్టువర్ట్ బిన్నీకి రూ.92 లక్షలు చెల్లించినట్లు తెలిపింది, ఆ త‌రువాత‌ హర్బజన్‌ సింగ్‌కు రూ.62 లక్షలు, స్పిన్నర్‌ అక్సర్‌ పటేల్‌కు రూ.37.51 లక్షలు, ఉమేశ్‌ యాదవ్‌కు రూ.34.79 లక్షలు చెల్లించినట్లు స‌మాచారం. 

  • Loading...

More Telugu News