: కత్తెర పడింది: ప్రసూన్ జోషి హయాంలో నిషేధానికి గురైన మొదటి సినిమా `ఎక్స్ జోన్`!
పహ్లాజ్ నిహలానీ స్థానంలో సీబీఎఫ్‌సీ చైర్మన్ గా నియమితుడైన ప్రసూన్ జోషి మొదటిసారి తన కత్తెర పదును చూపించారు. `ఎక్స్ జోన్` అనే బాలీవుడ్ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయకుండా నిషేధం విధించారు. దీంతో సినిమా రంగానికి చెందిన ప్రసూన్ జోషి చైర్మన్‌గా ఉండటం వల్ల ఎలాంటి సినిమాకైనా సర్టిఫికెట్ జారీ చేస్తారనే విషయం అపోహగానే మిగిలిపోయింది.
అభ్యంతరకర సన్నివేశాలు ఉన్న చిత్రాన్ని కత్తిరింపులతో సరిపెట్టకుండా నిషేధం కూడా విధించే అవకాశాలు ఉన్నాయని ప్రసూన్ జోషి రుజువు చేసుకున్నారు. ఫైజల్ కపాడి దర్శకత్వం వహించిన `ఎక్స్ జోన్` సినిమాలో పెద్దమొత్తంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉండటంతో నిర్మొహమాటంగా ఈ సినిమాను నిషేధించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు షారుక్ ఖాన్‌తో `అశోక` చిత్రంలో నటించిన హ్రిషితా భట్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది.