: బ్యాంకు ఉద్యోగాల పరీక్షలు రాయడానికి కర్ణాటకకు వెళ్లిన తెలుగువారిపై దాడులు!
కర్ణాటకలో తెలుగువారిపై దాడులు జరిగాయి. ఐబీసీఎస్, ఆర్ఆర్బీ పరీక్షలను రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులు, ఇతర రాష్ట్రాల వారిని కన్నడ సంఘాలు అడ్డుకున్నాయి. హుబ్లీలో బ్యాంకు పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగువారిని కర్రలతో కొట్టారు. రైల్వే స్టేషన్ ఎదుట ధర్నాకు దిగిన కన్నడిగులు... స్టేషన్ లోనే అనేక మందిని నిర్బంధించారు. స్థానికేతరులకు లాడ్జీల్లో రూములు ఇవ్వకూడదని, ఆటోల్లో ఎక్కనివ్వరాదని వీరు హెచ్చరికలు కూడా జారీ చేశారు.
పరీక్ష సెంటర్ల వద్ద కూడా కాపు కాసి, ఇతర రాష్ట్రాల వారిని అడ్డుకున్నారు. హుబ్లీ, గుల్బర్గ, దావణగెరె, బెంగళూరులో కన్నడ సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ ఉద్యోగాలను ఇతర రాష్ట్రాలవారు తన్నుకుపోతున్నారంటూ వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాలలో కోచింగ్ తీసుకున్న కన్నడిగులే... తెలుగువారు కర్ణాటకలో పరీక్ష రాయడానికి వస్తున్నారంటూ కన్నడ సంఘాలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.