: ఇర్మా హరికేన్ దూసుకొస్తోంది.. ఫ్లోరిడాలో హై అలెర్ట్... సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు!
కరేబియన్ దీవుల్లో ఇర్మా హరికేన్ బీభత్సం సృష్టించింది. ఆ దీవుల్లోని 2.5 కోట్ల మందిపై ఇర్మా హరికేన్ ప్రభావం చూపగా, దీని ధాటికి 17 మంది మృత్యువాత పడ్డారు. వేలాది చెట్లు, వందలాది నివాసాలు ధ్వంసమయ్యాయి. ఈ విధ్వంసాన్ని కరీబియన్ దీవుల నుంచి ఫ్లోరిడా దిశగా ఇర్మా హరికేన్ తీసుకెళ్తోంది. రేపు ఉదయం ఇర్మా హరికేన్ అమెరికా, ఫ్లోరిడా లోని ‘ఫ్లోరిడా కీస్’ ప్రాంతాన్ని తాకనుందని అధికారులు తెలిపారు.
ఇది తీరాన్ని తాకే సమయంలో 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో అలలు 25 అడుగుల ఎత్తున ఎగసిపడే అవకాశం ఉందని, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతం నుంచి సుమారు 10 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.