: ప్రతి రోజు కనీసం 24 సెల్ఫీలు దిగుతానంటున్న బాలీవుడ్ హీరో


తనకు సెల్ఫీలు దిగడమంటే చాలా ఇష్టమని బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్ అన్నాడు. ఎంత‌గా అంటే రోజుకు కనీసం 24 సెల్ఫీలు దిగుతాన‌ని, ఒక్కోసారి 100 సెల్ఫీలు కూడా దిగుతుంటానని చెప్పాడు. ఇటీవ‌ల ఆయ‌న ఓ ప్రైవేటు కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని తెలిపాడు. ప్ర‌స్తుతం సోషల్‌మీడియా ప్రాధాన్య‌త‌ ఎంతగానో పెరిగిపోయిందని ర‌ణ్‌వీర్ అన్నాడు. అందుకు తగ్గట్టుగానే ప్రపంచం కూడా మారిపోయిందని, సోషల్‌మీడియా మాధ్యమాలు రావడంతో సెల్ఫీ  ప్రాముఖ్యత‌ పెరిగిపోయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ చేతిలో ‘పద్మావతి’ సినిమా ఉంది. 

  • Loading...

More Telugu News