: దర్శకుడు రాజమౌళిని ఏఎన్నార్ అవార్డుతో సత్కరించనున్నాం: అక్కినేని నాగార్జున
‘బాహుబలి’ చిత్రం ద్వారా టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఏఎన్నార్ అవార్డు వరించింది. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డును రాజమౌళికి ఇస్తున్నట్టు ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని ప్రకటించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని నాగార్జున ప్రకటించారు.
‘సినీ రంగంలో ఎంతో ప్రతిభ కనబరిచిన మన జక్కన్న రాజమౌళికి ఏఎన్నార్ అవార్డును ఇవ్వనుండటం మాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు శిల్పాకళావేదికలో జరగనున్న కార్యక్రమంలో గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గారు ఈ అవార్డును రాజమౌళికి అందజేస్తారు’ అని నాగార్జున పేర్కొన్నారు.