: మీ దేశంలోనే గొడ్డు మాంసాన్ని తినండి.. ఆ తర్వాతే ఇండియాకు రండి: కొత్త కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్
కేంద్ర టూరిజం మినిస్టర్ గా పదవీ బాధ్యతలను స్వీకరించిన కేజే ఆల్ఫోన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పర్యటనకు వచ్చే విదేశీ పర్యాటకులు వారి దేశంలోనే గొడ్డుమాంసం తినాలని... ఆ తర్వాతే ఇండియాకు రావాలని ఆయన సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ పై ఉన్న నిషేధం వల్ల భారత టూరిజంపై ప్రభావం పడే అవకాశం ఉంది కదా? అనే ఓ ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. భువనేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విధంగా స్పందించారు.
ఆహారంపై ఎన్డీయే ప్రభుత్వం ఎలాంటి కోడ్ ను విధించలేదని కూడా ఆయన అన్నారు. బీజేపీ పాలనలో ఉన్న గోవాలో బీఫ్ తింటున్నారని, తన స్వరాష్ట్రం కేరళలో కూడా బీఫ్ తింటున్నారని... బీఫ్ తినే విషయంలో బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఆల్ఫోన్స్ స్పష్టం చేశారు. అయితే, దాదాపు 21 రాష్ట్రాల్లో ఆవులను వధించడాన్ని నిషేధించారు.