: కార్పొరేషన్ ఉత్సవాల నిర్వహణకు ఎవరూ ముందుకు రావట్లేదు: గుంటూరు ఎమ్మెల్యే ఆవేదన
గుంటూరు కార్పొరేషన్ ఉత్సవాలను నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గుంటూరు కార్పొరేషన్ 150 ఏళ్ల ఉత్సవాల నిర్వహణకు ఎవ్వరూ ఆసక్తి కనబరచడం లేదని, ముందుకు రావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులో సమస్యలను ఆయన ప్రస్తావించారు. లోపభూయిష్టంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలని, కార్పొరేషన్ లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాకినాడ కంటే ఎక్కువ మెజార్టీతో టీడీపీని గెలిపిస్తామని మోదుగుల అన్నారు.