: జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు..కానీ...!: ఆరుద్ర భార్య రామలక్ష్మి
ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు చాలా మంచి వ్యక్తి అని, సిన్సియర్ అని నాటి ప్రముఖ రచయిత ఆరుద్ర భార్య కె.రామలక్ష్మి అన్నారు. కాలమిస్ట్, రైటర్, క్రిటిక్ రామలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శోభన్ బాబు గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘నన్ను ఓ సారి శోభన్ బాబు తమ ఇంటికి పిలిచాడు. శోభన్ బాబు భార్య సరిగ్గా, గౌడి గేదెలా ఉంటుంది. అయితే, ఆమె మంచి మనిషి. ‘మా గురువు గారి కూతురు. ఆయన పెళ్లి చేయలేడు. అందుకని, నేను చేసుకున్నా’ అని నాతో చెప్పాడు. అందుకే, నన్ను వాళ్ల ఇంటికి పిలిచాడు. ఇంత అందగాడివి, ఆమెను ఎలా చేసుకున్నావని అంటానని అనుకున్నాడు. నేను చెప్పాను.. ‘దటీజ్ ఏ ఫేట్’. నా లాంటి గయ్యాళి ఆరుద్రకు భార్యగా వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ‘మాట పడనివ్వదు’ అని మా ఆయన అంటాడు. మాట పడ్డాక ఎత్తుకోవడం కష్టం కదా! మాట పడకుండా చూసుకుంటే అయిపోయే!’ అని అన్నారు.
‘‘జీవనజ్యోతి’ సినిమాకు ‘సిన్ని ఓ సిన్నీ.. ఓ సన్నజాజుల సిన్ని..’ పాట రాస్తున్నప్పుడు నేను శోభన్ బాబు ఇంటికి వెళ్లాను. ‘మీరు, కథను ఆడవాళ్ల పక్కన పెడతారు! టైటిల్స్ ఆడవాళ్ల పక్కన పెడతారు! కనీసం, మగ టైటిల్ అన్నా ఇవ్వరేంటి!’ అని శోభన్ బాబు అనేవాడు. శోభన్ బాబు వెరీ ఫైన్ మ్యాన్. జయలలిత వెరీ వెరీ.. ఫైన్ టాలెంటెడ్ గార్ల్. ‘గోరింటాకు’ సినిమాను జయలలిత ఇంట్లో చిత్రీకరించారు. ‘మీరందరూ ఇక్కడ భోజనం చేయండి’ అని ఆ రోజున శోభన్ బాబుతో జయలలిత అంది. ‘ఎందుకు, ఫుల్ డే షూటింగ్ లేదు’ అని ఆయన సమాధానం చెప్పాడు. ‘లేదు. నేను వడ్డిస్తా’ అంది..జయలలిత నిజమైన ప్రేమ కనబరుస్తుంది. జయలలితను శోభన్ బాబు పెళ్లి చేసుకుందామనుకున్నాడు. కానీ, సాధ్యపడలేదు. ఎందుకంటే, ఆయన తన భార్యను మోసం చేయలేక. శోభన్ బాబు చాలా సిన్సియర్. శోభన్ బాబు కొడుకు కూడా బాగానే ఉంటాడు. ఎందుకో! సినిమాల్లోకి రావద్దని చెప్పాడు!’ అని రామలక్ష్మి చెప్పుకొచ్చారు.