: పెద్దయ్యాక ఏం కావాలని అడిగితే ఎక్కువగా ఆ రెండు ఉద్యోగాల పేర్లే చెప్పారు: చంద్రబాబు
కృష్ణా జిల్లా పర్యటన ముగించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమహేంద్రవరంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా కూడా పాల్గొన్నారు. అందులో సీఐడీ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సమాజంలో పోలీసులపై ఎంతో బాధ్యత ఉందని అన్నారు.
తాను విద్యాలయాల్లోకి వెళ్లినప్పుడు మీరు జీవితంలో ఏం కావాలని విద్యార్థులను అడిగితే ఎక్కువగా రెండు ఉద్యోగాల పేర్లే చెబుతారని చంద్రబాబు చెప్పారు. అందులో ఒకటి పోలీస్ అయితే, రెండోది టీచర్ అని చెప్పారు. పోలీసు ఎందుకు అవుతావని అడిగితే చెడును అంతమొందిస్తామని చెబుతారని అన్నారు. అలాగే టీచర్ ఎందుకవుతావని అడిగితే పేద పిల్లలకు చదువు చెబుతామని చెబుతారని అన్నారు. సమాజం పట్ల ప్రతి ఒక్కరికీ ఎంతో బాధ్యత ఉందని చెప్పారు. పోలీస్, టీచర్ ఉద్యోగాలు ఎంతో బాధ్యతతో కూడుకున్నవని ముఖ్యమంత్రి చెప్పారు.