: చిన్నప్పుడు సిగరెట్ తాగుతూ నాన్న కంట పడితే చావగొట్టారు: సంజయ్ దత్


చిన్నప్పుడు సిగరెట్ తాగుతూ తన తండ్రి సునీల్ దత్ కి దొరికిపోయిన ఓ సంఘటనను బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గుర్తుచేసుకున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ దత్ చేతిలో సిగరెట్ కనబడటంతో మీడియా ప్రశ్నించగా ఆ సంఘటన గురించి చెబుతూ, ‘ఓ సారి బాత్రూమ్ లో సిగరెట్ తాగుతూ నాన్నకు దొరికిపోయా. అంతే, వెంటనే నన్ను బయటకి ఈడ్చుకెళ్లి చావగొట్టారు’ అని చెప్పాడు.

 సిగరెట్ తాగడం మానేయాలని తనకు ఉందని, కానీ, తన వల్ల కావడం లేదని, ఏదో రోజు ఈ అలవాటు నుంచి బయటపడతానని సంజయ్ దత్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా, ప్రస్తుతం ‘భూమి’ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఈ సినిమా గురించి ఆయన ప్రస్తావిస్తూ, ‘మహిళలను దేవతలతో సమానంగా చూస్తారు. అలాంటి, ఓ మహిళ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటించే అవకాశాన్ని నేనెలా వదులుకుంటాను?’ అన్నాడు సంజయ్.

  • Loading...

More Telugu News