: కుంబ్లే పేరు ప్రస్తావించని కోహ్లీ... విరుచుకుపడ్డ నెటిజన్లు!
మొన్న జరిగిన గురు పూజోత్సవం సందర్భంగా పలువురు దిగ్గజ క్రికెటర్లను విరాట్ కోహ్లీ గురువులుగా సంబోధించాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ కు కోహ్లీ అగ్రతాంబూలం ఇచ్చాడు. మిగిలిన జాబితాలో కపిల్ దేవ్, గంగూలీ, సెహ్వాగ్, ధోనీ, ద్రావిడ్, లక్ష్మణ్, రికీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్, షాన్ పొల్లాక్, షేన్ వార్న్, బ్రియాన్ లారా, గిల్ క్రిస్ట్, జావెద్ మియాందాద్, స్టీవ్ వా, ఇంజిమామ్ ఉల్ హక్, జయసూర్య, ఇమ్రాన్ ఖాన్, కల్లిస్ తదితరుల పేర్లు ఉన్న చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
అయితే ఇందులో అనిల్ కుంబ్లే పేరు లేకపోవడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, వారు కోహ్లీపై విరుచుకుపడ్డారు. కుంబ్లే పేరు మర్చిపోయావా కోహ్లీ? అంటూ కొందరు... గవాస్కర్, కుంబ్లే పేర్లు మరిచిపోయావంటూ మరికొందరు... 'అయితే, కుంబ్లే నుంచి నీవు ఏమీ నేర్చుకోలేదన్నమాట' అంటూ ఇంకొందరు... ఇలా కోహ్లీపై రకరకాలుగా మండిపడ్డారు.