: తుపాకీతో ఓ గొంతు మూగబోయేలా చేశారు.. ఇది అత్యంత దారుణం: కమలహాసన్
రాజకీయాల గురించి, సామాజిక సమస్యల గురించి విలక్షణ నటుడు కమలహాసన్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా బెంగళూరులో దారుణ హత్యకు గురైన ప్రముఖ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ఆయన స్పందించారు. తుపాకీతో ఓ గొంతు మూగబోయేలా చేయడం ద్వారా చర్చలో గెలవాలనుకోవడం అత్యంత దారుణమని కమల్ ట్వీట్ చేశారు. గౌరీ మరణంపై ఆమె కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.
గౌరీ లంకేష్ ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిట్ విచారణకు ఆదేశించారు.